త్వరలో ‘పబ్లిక్ సర్వీస్ డెలివరీ గ్యారంటీ’ చట్టం
దస్త్రాల పరిష్కారం, అనుమతులు, లైసెన్సుల పునరుద్ధరణ సేవలకు నిర్దిష్ట కాలపరిమితి నిర్ణయించే ‘పబ్లిక్ సర్వీస్ డెలివరీ గ్యారంటీ’ చట్టాన్ని ప్రభుత్వం అమలు చేయబోతోంది. సేవల్లో జాప్యం జరిగితే సంబంధిత సంస్థలకు అప్పీలు చేసే అవకాశం ఈ చట్టం ద్వారా దరఖాస్తుదారునికి ఉంటుంది. అధికారుల కాలయాపనగా రుజువైతే పరిహారం పొందే వీలుంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం సాయంత్రం సచివాలయంలో జరిగిన వ్యాపార సరళీకరణ కమిటీ (ఈవోడీబీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వ్యాపార సంస్కరణల కార్యప్రణాళిక-2017(బీఆర్ఏపీ)ను ఈ సందర్భంగా ఆయన ఆమోదించారు.








