ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
ఉగాది పండుగ తెలుగువారి జీవితాల్లో ఉషస్సులు నింపాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, దేశ, విదేశాల్లోని తెలుగువారికి ఆయన హేవళంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. మన పండుగలు తెలుగు సంప్రదాయాలు, ఆచార సంస్కృతులతో అనుసంధానమై ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. తెలుగువారి మూల పురుషుడు శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన రోజుగా చరిత్రకారులు చెబుతారని తెలిపారు. ప్రజలంతా నూరుశాతం సంతోషంగా ఉండాలన్నదే తమ ప్రభుత్వ అభిమతమన్నారు. సంక్షేమానికి, అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయ, ఉద్వాన పంచాంగాల్లో శాస్త్రవేత్తలు పొందుపరిచిన వైజ్ఞానిక సూచనలను అనుసరించాలని రైతులను కోరారు. జీవితం కూడా వసంత రుతువు లాంటిదేనని, చైతన్యంతో ఉండాలని సందేశమిచ్చే పండుగా ఉగాది అని అన్నారు.













