Chandrababu: రాజేంద్రప్రసాద్ కు సీఎం చంద్రబాబు సత్కారం
సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాజేంద్రప్రసాద్‌కు కేంద్ర ప్రభుత్వం ఇటీవల పద్మశ్రీ పురస్కారాన్ని (Padma Shri award) ప్రకటించిన నేపథ్యంలో చంద్రబాబు ఆయన్ను సాదరంగా ఆహ్వానించారు. పురస్కారం వచ్చినందుకు అభినందించి, సత్కరించారు. నాలుగు దశాబ్దాలుగా వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా తెలుగు సినిమా (Telugu cinema) ఖ్యాతిని పెంచినందుకు పురస్కారం లభించిందని హర్షం వ్యక్తం చేశారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






