సినారే మృతి పట్ల సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానూభూతి తెలిపారు. జ్ఞానపీఠ్ పురస్కారానికే వన్నె తెచ్చిన మహా రచయిత సినారె అని అన్నారు. ఎన్టీఆర్తో సిరారె ఎంతో సన్నిహితంగా ఉండేవారని గుర్తుచేసుకున్నారు. రచయితగా, రాజ్యసభ సభ్యుడిగా సినారె అందించిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయని అన్నారు. తెలుగు చలనచిత్ర రంగంలో సినారె పాటలు ఆణిముత్యాలు అని ఆయన కొనియాడారు.








