కాకినాడలో సీఎం చంద్రబాబు ప్రచారం
కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రచారం చేయనున్నారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం విడుదల చేసిన కార్యక్రమం ప్రకారం ఈ నెల 26వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన విజయవాడ నుంచి కాకినాడ వెళ్తారు. మరుసటి రోజు మధ్యాహ్నం వరకూ అక్కడ గడిపి తర్వాత విజయవాడ వస్తారు.








