సినారె తపాలా బిళ్ల విడుదల
విజయనగరంలో ఎలయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రముఖ సాహితీవేత్త, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత స్వర్గీయ డాక్టర్ సి.నారాయణరెడ్డి స్మారక తపాలా బిళ్లను కలెక్టర్ వివేక్ యాదవ్ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సినారె మృతి తెలుగు సాహిత్య రంగానికి తీరని లోటని, ఆయన జ్ఞాపకార్థంగా తపాలా బిళ్లలు ఆవిష్కరించినట్టు తెలిపారు. యువ రచయితలు ఆయన బాటలో నడవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎలయన్స్ క్లబ్ వైస్ గవర్నర్ సముద్రాల గురుప్రసాద్, స్వచ్ఛభారత్ జిల్లా కన్వీనర్ పాణంగిపల్లి అశోక్ తదితరులు పాల్గొన్నారు.








