దుర్గగుడి ట్రస్ట్ బోర్డ్ ప్రత్యేక ఆహ్వానితురాలిగా చిరంజీవి కుమార్తె సుస్మిత
సినీనటుడు చిరంజీవి(Chiranjeevi) కుమార్తె కొణిదెల సుస్మిత (Konidela Sushmita)ను విజయవాడలోని దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ( దుర్గ గుడి) ట్రస్ట్ బోర్డు ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమిస్తూ ప్రభుత్వం మెమో జారీ చేసింది. అవసరమైనప్పుడు ఆలయ ఈవో(EO), ట్రస్ట్‌బోర్డు (Trust Board)కు సలహాలు ఇవ్వొచ్చని, ప్రధాన ఉత్సవాల సమయంలో ఆలయ పరిపాలనలో సహాయపడొచ్చని పేర్కొంటూ దేవాదాయశాఖ కార్యదర్శి కె.కన్నబాబు (K. Kannababu) మెమోలో పేర్కొన్నారు.








