ఇంటీరియర్ డిజైన్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష
రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న సెక్రటేరీయేట్, అసెంబ్లీ, హైకోర్టు భవనాల ఇంటీరియర్ డిజైన్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సమీక్షించారు. ప్రముఖ ఆర్కిటెక్ట్ సంస్థ నార్మన్ ఫోస్టర్స్ ప్రతినిధుల బృందం ఇంటీరియర్ డిజైన్లను ప్రజెంట్ చేసింది. దీనిపై సీఎం చంద్రబాబు పలు సూచనలు చేశారు. ఈ సమీక్షలో మంత్రి నారాయణ, పట్టణాభివృద్ధి శాఖ, సీఆర్డీఏలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.








