25న అమరావతి తుది ఆకృతుల స్వీకారం
అమరావతిలో నిర్మించనున్న ఐకాన్ ఆకృ తులు, నిర్మాణ ప్రణాళికలను రూపొందిస్తున్న అంతర్జాతీ య సంస్థ నార్మన్ ఫోస్టర్ సంస్థతో ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు అక్టోబరు 24, 25 తేదీల్లో సమావేశం కానున్నారు. లండన్లో జరిగే ఈ సమావేశంలో అమరావతిలో ప్రభుత్వ భవన సముదాయాల తుది ప్రణాళికలు, ఆకృ తులను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్ర బాబు, ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి పరిశీ లించి ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్ 11 నుండి 13 వరకూ లండన్లోనే నార్మ న్ ఫోస్టర్ బృందం ఆధ్వర్యం లో పరిపాలన నగర ఆకృతుల రూపకల్పనపై ప్రత్యేక సమా వేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి వెంట వెళ్లే బృందంలో పాల్గొని సలహాలు, సూచ నలు అందించేందుకు ప్రముఖ తెలుగు చలనచిత్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి సంసిద్ధత వ్యక్తం చేశారని సిీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ వెల్లడించారు. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో సుదీర్ఘంగా జరిగిన సీఆర్డీఏ సమీక్షా సమావేశంలో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి కమిషర్ తీసుకువచ్చారు. ప్రణాళికల దశ నుండి బయట పడి ఇక సత్వరమే పనులు ప్రారంభించాలని, ఇప్పటికే నిర్మాణంలో ఉన్న వివిధ ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచాలని సిఎం చంద్రబాబు సీఆర్డీఏ, ఏడీసీ ఉన్నతాధికారులను ఆదేశించారు.








