19న నంద్యాలకు సీఎం చంద్రబాబు
నంద్యాల ఉప ఉన్నిక ప్రచారానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 19న రానున్నారు. రెండురోజులపాటు ఆయన నంద్యాలోనే ఉంటారని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే వైసీపీ అధ్యక్షుడు జగన్ నంద్యాలలో మకాం వేశారు. వారం రోజులుగా అంతా తానే అయి ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు రాకతో ప్రధాన పార్టీల అధినేతల మధ్య ఉప పోరు వేడెక్కనుంది. నంద్యాల పట్టణం, పరిసర గ్రామాలతోపాటు గోస్పాడు మండలంలో చంద్రబాబు ప్రచార సభల్లో పాల్గొంటారని టీడీపీ వర్గాలు తెలిపాయి.








