నెగ్గుతామనుకోవడం వేరు… నెగ్గడం వేరు … చంద్రబాబు
కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నిక నిర్వహణపై పార్టీ నేతలతో చంద్రబాబు మాట్లాడారు. టెలీకాన్ఫరెన్స్‌లో కాకినాడ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నేతలు నెగ్గుతామనుకోవడం వేరు నెగ్గడం వేరు ఖచ్చితంగా గెలిచితీరాలి అని పార్టీ నేతలతో అన్నారు. ఖచ్చితంగా అన్ని డివిజన్లలో టీడీపీ గెలిచేలా చూడాలని నేతలకు ముఖ్యమంత్రి సూచించారు. మూడేళ్ల అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లండని నేతలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. బీజేపీకి కేటాయించిన డివిజన్లలోనూ అభ్యర్థుల గెలుపునకూ టీడీపీ కృషిచేయాలన్నారు. సామాజికపరంగా అన్నివర్గాలకు ప్రాధాన్యం ఇస్తున్నాం, ఏ ఒక్కరికీ అన్యాయం జరగవద్దన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నామని అన్నారు. ప్రజలను చైతన్యపరచాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు.








