ముందస్తు ఎన్నికలకు సిద్ధం కండి
రానున్న సార్వత్రక ఎన్నికలకు పార్టీ నాయకులు, శ్రేణులు సమాయత్తం కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని హ్యాపీ రిసార్ట్ ్సలో సోమవారం సెంటర్ ఫర్ లీడర్ షిప్ ఎక్స్లెన్స్ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీలతోపాటు నంద్యాల, కాకి నాడల్లో పార్టీ విజయం కోసం పనిచేసిన నేతలంతా హాజర య్యారు. వచ్చే ఏడాది డిసెంబ ర్లో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలున్నాయని, రాష్ట్రం లో కూడా అదే సమయంలో ఎన్నికలు రావచ్చని కాబట్టి మనమంతా ఇప్పటినుంచే ఎన్నికలకు సిద్దం కావాలన్నారు. మిషన్ 2019లో భాగంగా రాష్ట్రంలోని 160 సీట్లు కైవసం చేసుకోవాలన్న లక్ష్యంగా పనిచేయాలన్నారు.








