తెలుగుజాతి ఐక్యతకు పుచ్చలపల్లి కృషి ఎనలేనిది
మహానేత పుచ్చలపిల్లి సుందరయ్యకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘన నివాళులర్పించారు. ఈ సంరద్భంగా చంద్రబాబు మాట్లాడుతూ విశాలాంధ్రలో ప్రజారాజ్యం నినాదంతో సుందరయ్య తెలుగుజాతి ఐక్యతకు ఎనలేని కృషి చేశారని శ్లాషించారు. నీటి పారుదల రంగంలో ఆయనకు అపారమైన పరిజ్ఞానం ఉందని కొనియాడారు. రాజకీయ సిద్ధాంతాలు ఏమైనా, తుదిశ్వాస వరకు పుచ్చలపల్లి నిజాయితీగా జీవించారని అన్నారు. విలువలతో కూడిన రాజకీయాలకు ఆయన ప్రతినిధి అని, పీడత ప్రజల కోసం అలుపెరగని పోరాటం చేశారన్నారు.








