సమష్టి కృషితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం : చంద్రబాబు
సమష్టి కృషితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సృష్టం చేశారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో రెండు రోజుల పాటు జరిగే కలెక్టర్ల సదస్సును ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రపంచంలో అత్యుత్తమ విధానాలన్నీ రాష్ట్రంలో అమలు కావాలని అన్నారు. ప్రభుత్వ లక్ష్యాలు క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేయాల్సి బాధ్యత కలెక్టర్లదేనని సృష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రంగాల్లో 11.92 శాతం వృద్ధి రేటు సాధించినందుకు అధికార యంత్రాంగాన్ని అభినందించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో బతికేలా పాలన అందిస్తున్నామని తెలిపారు.
రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు తొలగించాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. సాంకేతికతతోనే ఏదైనా సాధ్యమని నిరూపిస్తున్న ప్రభుత్వం తమదని పేర్కొన్నారు. విద్యార్థి వలే మూడు నెలలకు ఒకసారి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా బయోమెట్రిక్ ఉపయోగించాలని ఇందులో ఎలాంటి మినహాయింపులు లేవని తేల్చిచెప్పారు. సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నామని అన్నారు. మూడో విడత రుణమాఫీ తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు. ఉద్వానవన పంటలకు ప్రాధాన్యమివ్వాలి. ఉద్యానవన పంటల సాగు కోటి ఎకరాలకు పెంచాలన్నారు. భూసార పరీక్షలు 100 శాతం పూర్తి చేశాం అని తెలిపారు.








