అవి పూర్తయితే ఏపీ రూపురేఖలు మారిపోతాయి : చంద్రబాబు
పోలవరం, అమరావతి పూర్తయితే రాష్ట్ర రూపురేఖలే మారిపోతాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి డిజైన్లపై అసెంబ్లీ కమిటీ హాల్లో నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ రైతుల త్యాగంతోనే నవ్యాంధ్ర రాజధాని నగరం అమరావతి నిర్మాణం సాధ్యమవుతోందని అన్నారు. భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. భూములు కొనుగోలు చేయాలంటూ రూ.40వేల కోట్ల భారం పడేదన్నారు. రాజధానిలో 9 నగరాలు, 27 టౌన్‌షిప్‌లను నిర్మించాలని ప్రణాళిక రచించినట్లు తెలిపారు. రాజధాని డిజైన్లపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ ఆలోచనలు పంచుకోవాలని సూచించారు.













