కలాంకు చంద్రబాబు నివాళి
భారతీయ క్షిపణి శాస్తవ్రేత్త, మాజీ రాష్టప్రతి డాక్టర్ ఏపిజె అబ్దుల్ కలాం నిత్య స్ఫూర్తిదాత, మార్గదర్శకుడని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. జూలై 27న కలాం వర్ధంతి సందర్భాన ఆయనతో తన అనుభవాలను ముఖ్యమంత్రి జ్ఞాపకం చేసుకున్నారు. వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు భారత రాష్టప్రతి అభ్యర్థిగా అబ్దుల్ కలాం పేరును ఎన్డీయే పక్షాల తరపున తాను ప్రతిపాదించినట్లు గుర్తు చేసుకున్నారు.








