మంత్రివర్గ విస్తరణపై సీఎం చంద్రబాబు కసరత్తు
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో ఆశావహుల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసేందుకు నేతలు క్యూ కడుతున్నారు. ఉదయం నుంచి ముఖ్యమంత్రి తనకు అందుబాటులో ఉన్న నాయకులు, పార్టీ ముఖ్యనేతలతో మంతనాలు కొనసాగిస్తున్నారు. మంత్రివర్గంలోని 26 స్థానాలను భర్తీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ముఖ్య నేతలతో విడివిగా మాట్లాడుతున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకోవడంతో కొంత తలనొప్పులు తప్పడం లేదు. దీంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతలకు స్వయంగా చంద్రబాబే ఫోన్లు చేసి బుజ్జగిస్తున్నారు. రేపు ఉదయం మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో ఈ అర్ధరాత్రికి తుది జాబితా విడుదలయ్యే అవకాశం కనబడుతోంది. పార్టీ సీనియర్ నేతలైన కళా వెంకట్రావు, యనమల రామకృష్ణుడితో ముఖ్యమంత్రి తొలివిడతగా సమావేశమయ్యారు.













