ఐటీలో ఏపీ టాప్
సమాచార, సాంకేతిక రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించినట్టు సిఎం చంద్రబాబు తెలిపారు. మంగళగిరి సమీపంలో పదెకరాల విస్తీర్ణంలో రూ. 600 కోట్లతో నిర్మించిన పై డేటా సెంటర్ను శుక్రవారం ప్రారంభించారు. ఇందులో వెయ్యి రాక్లు ప్రభుత్వానికి, మరో నాలుగు వేల ర్యాక్లు ప్రైవేటు సంస్థలకు కేటాయించనున్నారు. దీనివల్ల ప్రత్యక్షంగా 1300 మందికి ఉపాధి లభించనుంది. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో సిఎం మాట్లాడుతూ రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పారదర్శకంగా, జవాబుదారీతనంతో అమలు చేసేందుకు అవసరమైన సాంకేతిక విధానాలను అవలంభిస్తున్నట్టు చెప్పారు. పింఛన్లు, గృహ నిర్మాణ కార్యక్రమాల్లో సాంకేతికతను వినియోగిస్తున్నామని తెలిపారు.








