వచ్చే నెలలో లండన్‌కు సీఎం చంద్రబాబు, రాజమౌళి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దర్శకధీరుడు రాజమౌళి వచ్చే నెలలో లండన్‌లో పర్యటించనున్నారు. అక్టోబర్ 24, 25 తేదీల్లో నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. అటు అక్టోబర్ 11, 12, 13 తేదీల్లో లండన్ నార్మన్ ఫోస్టర్ ఆఫీసులో రాజధాని ఆకృతులపై జరిగే వర్క్ షాపులో రాజమౌళి పాల్గొనున్నారు. కాగా దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా డిజైన్లు ఉండాలని రాజమౌళికి ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించిన సంగతి తెలిసిందే.








