ఆరోగ్య రాజధానిగా అమరావతి
ఆరోగ్య రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. రెండు సంత్సరాల్లో హెల్త్ హబ్‌గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. మన రాష్ట్రానికి చెందిన యువత ఉద్యోగల కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదని, ప్రపంచ స్థాయి సంస్థలను మన వద్దకే వస్తాయని అన్నారు. తుళ్లూరు మండలం దొండపాడు సమీపంలో బి.ఆర్.శెట్టి మెడిసిటీ ఆసుపత్రికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ బెంగళూరుకు చెందిన బీఆర్శెట్టి గల్ఫ్‌లో వ్యాపారాలు చేస్తున్నారన్నారు. దశల వారీగా ఏపీలో రూ.12 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. బీఆర్శెట్టితోపాటు గల్ప్‌దేశాల నుంచి ఎంతో మంది అమరావతిలో పెట్టుబడులు పెట్టబోతున్నారని అన్నారు. త్వరలో అమరావతి నుంచి ఎమిరేట్స్‌కు విమానం తిరగనుందన్నారు. త్వరలో ఇండో-యూకే ఆస్పత్రికి శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. ఎస్ఆర్ఎం, విట్ సంస్థలు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తాయన్నారు. త్వరలో అమరావతిలో పరిపాలన భవనాల పనులను ప్రారంభిస్తామని, అమరావతిలో 27 టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. తుళ్లూరు, నెక్కళ్లు, అనంతవరంలో గేమింగ్, వర్చువల్ స్టూడియోలు, అమరావతిని నాలెడ్జ్, మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దుతామని సృష్టం చేశారు.








