అమరావతిలో మరో ప్రతిష్టాత్మక సంస్థ
అమరావతిలో మరో ప్రతిష్టాత్మక సంస్థకు అంకురార్పణ జరిగింది. బీఆర్శెట్టి మెడిసిటీకి చంద్రబాబు నాయుడు శుంకుస్థాపన చేశారు. తుళ్లూరు మండలం దొండపాడు వద్ద మెడిసిటీ నిర్మాణం జరగనుంది. మెడిసిటీలో మెడికల్ వర్సిటీ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, వైద్యపరికరాల తయారీ యూనిట్, నాచురోపతి, యోగా కేంద్రాన్ని నిర్మించనున్నారు. మెడిసిటీలో 800 మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించనున్నారు.








