మనవడి టాలెంట్ చూసి చంద్రబాబు ఫిదా!
గ్రాండ్ ఫాదర్ హైటెక్ సిటీ నిర్మిస్తే… గ్రాండ్ సన్ జెట్ స్పీడ్ టెక్ని యూజ్ చేస్తున్నాడు. తాత విండోస్ అయితే మనవడు అండ్రాయిడ్ అనిపించుకున్నాడు. హైదరాబాద్కు ఐటీని పరిచయం చేసిన బాబుగారి మనుమడు తాతగారిని మించిపోయాడు. హైటెక్ తాతయ్యకు తగ్గ వంశోద్ధారకుడని నిరూపించుకున్నాడు. నేటి జనరేషన్ టెక్నాలజీ అప్డేషన్ గురించి తన మనవడి టెక్నాలజీ తెలివితేటల గురించి సభాముఖంగా చిరునవ్వులు చిందిస్తూ ప్రస్తావించారు సీఎం చంద్రబాబు.
ప్రపంచ పటంలోనే హైదరాబాద్కు గుర్తింపు తెచ్చిన సీఎంగా చంద్రబాబు ఫేమస్. అదికూడా టెక్నాలజీ ద్వారానే. హైటెక్ సిటీని నిర్మించి, ఐటీ కారిడార్ ఏర్పాటు చేసి, ఇండియాలోనే టెక్నాలజీని వినియోగించడంలో ఏపీ ముందంజలో ఉందని నిరూపించిన ముఖ్యమంత్రి నేడు తన మనవడి కన్నా వెనుకబడిపోయారు. తాత తరంతో పోల్చితే మనవడి తరంలో టెక్నాలజీ జెట్ స్పీడ్లో ఉందన్నారు. నిత్యం బిజీ బిజీ గా ఉంటూ అడ్మినిస్ట్రేషన్ లో పర్ ఫెక్ట్ అనిపించుకునే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టెక్నాలజీ విషయంలో తన మనవడి చేతిలో ఓడిపోయానన్నారు.
కారణం పాత జనరేషన్ టెక్నాలజీ ఉపయోగించడంలో వెనుకబడిందని, నేటి యువతరం టెక్నాలజీ మయం అని తెలిపారు. ఈ ప్రగతి ద్వారా మరింత మెరుగైన సేవలను ప్రజలకు అందిచగలమన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆయన ఈ ప్రగతి శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. సాంకేతికతను ఎప్పటికపుడు తెలుసుకుని ముందుకి వెళితే అద్భుత ఫలితాలు వస్తాయని, ఈ-ప్రగతి త్వరలోనే చరిత్ర సృష్టిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు సియమ్













