ఫరూక్‌కు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్
కర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్‌కు తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆయనకు శాసనమండలి చైర్మన్ పదవి ఇవ్వడానికి తాను సుముఖంగా ఉన్నాని చెప్పిన ఆయన దానికి ఒక షరతు విధించారు. రాబోయే ఉప ఎన్నికల్లో బాగా పనిచేసి నంద్యాల సీటును గెలిపించుకొని వస్తే కౌన్సిల్ చైర్మన్ పదవి ఇస్తాను. అక్కడ టీడీపీకి ముస్లిం మైనారిటీల ఓట్లు ఎన్ని పడ్డాయో కూడా చూస్తా. దీన్ని సవాల్‌గా తీసుకొని పనిచేయ్యి అని ఫరూక్‌తో చెప్పినట్లు సమాచారం. తప్పకుండా గెలిపించి వస్తానని ఫరూక్ చంద్రబాబుతో చెప్పారు.













