జీఎస్ఎల్వీఎఫ్-09 విజయవంతంపై హర్షం
జీఎస్ఎల్వీఎఫ్-09 ప్రయోగం విజయవంతం కావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. 2,240 కిలోల బరువున్న జీశాట్ -9 ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టినందన ఇస్రో శాస్త్ర వేత్తల బృందానికి అభినందనలు తెలిపారు. భారతదేశంతో పాటు, దక్షిణాసియా దేశాల ప్రయోజనాలకు జీశాట్-9 సేవలు ఉపయోగపడటం ఎంతో సంతోషకరం అన్నారు.








