కేంద్రమంత్రి కుమార్తె పెళ్లి వేడుకలో చంద్రబాబు
కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కుమార్తె వివాహ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఢిల్లీలోని హోటల్ తాజ్ ప్యాలెస్‌లో జరిగిన వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం ఈ కార్యక్రమానికి వచ్చిన కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, అనంత్ కుమార్, యోగా గురు బాబా రాందేవ్‌తో కాసేపు సంభాషించారు. అంతకు ముందు హోటల్ వద్ద చంద్రబాబును రవిశంకర్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సమయంలో రవిశంకర్ బంధువులు బాబుతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు.








