కార్తీక్‌ను అభినందించిన సీఎం చంద్రబాబు
స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ హెల్త్‌కేర్‌లో ప్రొఫెసర్‌గా అవకాశం దక్కించుకున్న కార్తీక్ మిక్కినేనిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభినందించారు. గుంటూరు జిల్లా బ్రాడీపేటకు చెందిన కార్తీక్ మిక్కినేని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిశారు. ఈ సందర్భంగా ఉన్నతస్థాయికి ఎదిగి తెలుగుజాతి ప్రతిష్టను ఇనుమడింపజేసిన కార్తీక్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. అమరావతిలో వైద్య, ఆరోగ్య రంగం అభివృద్ధికి, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ హెల్త్‌కేర్ విభాగానికి మధ్య వారధిగా ఉండాలని, భవిష్యత్‌లో అంటువంటి సేవలు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి అందుబాటులో తేవాలని కార్తీక్ మిక్కినేనికి ముఖ్యమంత్రి సూచించారు. వర్సిటీలోని వ్యాస్కులర్ సర్జన్ విభాగంలో అమెరికాయేతర వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్ చెందని కార్తీక్ ఎంపికవడం అరుదైన అవకాశమని ముఖ్యమంత్రి అన్నారు.













