నేటి నుంచి 3 రోజులు వెంకయ్య పర్యటన
నేటి నుంచి మూడు రోజులపాటు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఏపీలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆయా జిల్లాలలోని బీజేపీ నాయకులతో ఆయన ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు తెలుస్తుంది. ఈ మధ్యే అమిత్షా ఏపీకి వచ్చి వెళ్లిన సంధర్భంలో వెంకయ్య పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.








