కలిసి పనిచేస్తే అద్భుతాలు : చంద్రబాబు
విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలు, ప్రభుత్వం కలిసి పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విశాఖలోని ఓ హోటల్లో విజయనగరం జిల్లా గజపతినగరం మండలం రాళ్లపాక గ్రామంలో స్థాపించబోతున్న సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సంస్థ శంకుస్థాపన శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో యువత అభ్యసిస్తున్న విద్యకు, సంపాదిస్తున్న జ్ఞానానికి, క్షేత్రస్థాయిలో అమలవుత్ను నైపుణ్యానికి ఏమాత్రం పొంతన ఉండటం లేదని తెలిపారు. ఫలితంగా పలువురు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందలేని పరిస్థితుల్లో ఉన్నారని తెలిపారు. విద్యతోపాటు వృతినైపుణ్యాన్ని అందించేలా సెంచూరియన్ విశ్వవిద్యాలయం ఏపీలో ప్రాంగణం ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం ప్రశంసనీయమని తెలిపారు.








