యోగాతో ప్రపంచంలో ఏదైనా సాధించగలం : చంద్రబాబు
యోగాతో ప్రపంచంలో ఏదైనా సాధించగలం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలతో కలిసి ఆయన యోగసనాలు వేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ యోగా ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప వరమని అన్నారు. యోగా ఒక్కప్పుడు భారత్‌కే పరిమితం, మోదీ ప్రధాని అయ్యాక యోగాపై ఐరాసలో ప్రతిపాదన ఇచ్చారు. ప్రపంచం మొత్తం పాటిస్తే మానవాళికి ఉపయోగపడుతుందని వివరించారు. ఐరాస పిలుపు మేరకు 177 దేశాల్లో యోగా జరుపుకుంటున్నారు. యోగాతో మనుసు ప్రశాంతంగా ఉంటుంది. సంక్షోభంలో ఉన్నప్పుడే ధైర్యంగా ఉండాలి. రాష్ట్రం విడిపోయిందని బాధపడుతూ కూర్చుంటే మూడేళ్లలో ఇంత అభివృద్ధి సాధించగలిగేవారమా? సంకల్పాన్ని నిజం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడాలి అని అన్నారు.








