ఊహించని అభివృద్ధి అంటే ఇదే: మంత్రి లోకేష్
తాను చిన్నపుడు రేణిగుంట ఎయిర్‌పోర్టు రోడ్డు నుంచి నారావారిపల్లెకు వెళ్లే వాడినని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి లోకేష్ అన్నారు. చిత్తూరు జిల్లా రేణిగుంటలో సెల్కాన్ చరవాణి యూనిట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ ఇదే రోడ్డులో ఓ సెల్ ఫోన్ కంపెనీ వస్తుందని ఊహించలేదని తెలిపారు. ఊహించని అభివృద్ధి అంటే ఇదేనని అన్నారు. రాబోయే రెండేళ్లలో 6 లక్షల ఉద్యోగాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 2019 లోపు రేణిగుంట క్లస్టర్లో లక్ష మందికి ఉపాధి కల్పిస్తామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతున్నారని, ఆయన వేగాన్ని అందుకోవడం యువకుడైన తనవల్లే కావడం లేదన్నారు.













