ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిస్తాం : చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో ఒలింపిక్స్‌కు కూడా ఆతిథ్యమిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. 4వ ఇండియన్ ఓపెన్ వరల్డ్ ర్యాంకింగ్ స్నూకర్ టోర్నమెంటును ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ గతంలో తాను ముఖ్యమంత్రిగా వున్నప్పుడు అఫ్రో యాషియన్ గేమ్స్‌ను, కామెన్వెల్త్ క్రీడలను ఘనంగా నిర్వహించామని గుర్తు చేశారు. భారత దేశంలో ప్రస్తుతం క్రికెట్‌పై మక్కువ ఎక్కువగా వుందని, మిగిలిన క్రీడలను ప్రోత్సహిస్తూ రాష్ట్రంలో క్రీడలకు ఉత్తమ మౌలికసదుపాయాలను కల్పించనున్నట్లు తెలిపారు. అమరావతిలో స్నూకర్ స్టేడియంను నిర్మిస్తామన్నారు. సంతోషమే సూచిగా పనిచేస్తామని అన్నారు. క్రీడలు, కల్చరల్ కార్యక్రమాలతో సంతోషం లభిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఒలింపిక్స్ క్రీడలను నిర్వహించే స్థాయికి చేర్చుతామన్నారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్ను పెంచేలా పర్యాటకంలో, క్రీడల్లో ప్రోత్సహిస్తున్నామన్నారు.








