సీఎం చంద్రబాబుతో కెనడా ప్రతినిధుల బృందం భేటీ
నవ్యాంధ్రలో 15 రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి కెనడా ఆసక్తి వ్యక్తం చేసింది. ఆ దేశానికి చెందిన 15 సంస్థల ప్రతినిధుల బృందం కెనడా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ డె బిన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో వెలగపూడి సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. నవ్యాంధ్రలో విద్యుత్తు, సౌర, పవన్ విద్యుత్తు రంగంంలో అపారమైన అవకాశాలున్నాయని, కర్నూలులో వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్తు ప్లాంటును నిర్మించడమే కాకుండా వచ్చే రెండేళ్లలో 4600 మెగావాట్ల సౌర, పవన విద్యుత్తును అందుబాటులోకి తీసుకెళుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. ఒకసారి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కెనడా పర్యటిస్తే అక్కడ పెట్టుబడులకు సంబంధించిన కూలంకుషంగా చర్చించవచ్చని జెన్నిఫర్ కోరారు. ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాలు కెనడాలో ఉన్నాయని, వాటిని సందర్శించి తమ ఆతిథ్వం స్వీకరించాలని ఆయనను ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్‌ను ఉత్తమ అభ్యాసాల పరిశోధనశాలగా మారుస్తున్నారని ముఖ్యమంత్రిని ఆమె కొనియాడారు.








