అవినీతికి పాల్పడితే.. 1100కి ఫోన్ చేయండి
అవినీతికి పాల్పడే వారు ఎంతటి వారైనా ఉపేక్షించనని చంద్రబాబు హెచ్చరించారు.అధికారులు అవినీతికి పాల్పడుతున్నా.. సమస్యలు పరిష్కరించకున్నా ప్రజలు 1100 ఫోన్ నెంబరుకు సమాచారం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఇప్పటికే ఈ ఫోన్ నెంబరుకు మంచి స్పందన వస్తోందని ఆయన అన్నారు.ఇప్పటికే 27మంది అవినీతి ఉద్యోగులు తాము తీసుకున్న అవినీతి సొమ్మును వెనక్కి ఇచ్చేశారని వివరించారు.








