సీఎం చంద్రబాబుతో బోయపాటి భేటీ
రాజధాని అమరావతి నిర్మాణంలో తెలుగు సంస్కృతి, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సినీ దర్శకుడు బోయపాటి శ్రీను భేటీ అయ్యారు. ఈ అంశంపై 15 నిమిషాల పాటు ఆయన తన అభిప్రాయాలను చంద్రబాబుకు వివరించారు. అమరావతి నిర్మాణం దశ నుంచే అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాలన్న అభిప్రాయంతో ఉన్న ప్రభుత్వం పలువురి సలహాలు, సూచనలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే బోయపాటి కూడా ముఖ్యమంత్రిని కలిశారు.








