ప్రాణం ఉన్నంతవరకు తెలుగుదేశంలోనే
ప్రాణం ఉన్నంత వరకు తాను తెలుగుదేశం పార్టీలో కొనసాగుతానని మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తెలిపారు. శ్రీకాళహస్తిలోని టీడీపీ కార్యాలయంలో మాజీమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న అనంతరం కార్యకర్తలతో సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించారు. భేటీ తర్వాత ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను వెనక్కి తీసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ అనారోగ్యం కారణంగానే మంత్రి పదవి నుంచి తొలగించారనే ప్రచారంతో ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసినట్లు తెలిపారు. పార్టీకి మాత్రం రాజీనామా చేయలేదని తెలిపారు. కార్యకర్తల అభిప్రాయం మేరకు రాజీనామా ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. తనకు మద్దతుగా నిలిచి రాజీనామా చేసిన ప్రజాప్రతినిధులు కూడా వాటిని ఉపసంహరించుకోవాలన్నారు.













