అద్భుత నగరిగా అమరావతి
అద్భుతమైన అమరావతి నగర నిర్మాణాన్ని వేగవంతం చేసే క్రమంలో భాగంగా రాజధాని నగరంలో ఒక ప్రణాళిక సంస్థను (ప్లానింగ్ ఇన్టిట్యూట్)ను ఏర్పాటు చేసేందుకై రాజధాని నగర ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్డీఏ) బ్లు ప్రింట్‌ను సిద్ధం చేసింది. ప్రతిపాదిత అమరావతి ప్లానింగ్ మరియు డిజైన్ పరిశోధన (ఎపిడిఆర్ఐ) ఓపెన్ డేటా విధానం ద్వారా అనునిత్యం ఆధునిక విధానాలను ఆవిష్కరిస్తూ ప్రజాజీవనానికి అనుగుణమైన అద్భుత వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. ఈ సంస్థ ప్రపంచ బ్యాంకు నుండి ఆర్థిక సహాయాన్ని పొందడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కల వివిధ ప్రఖ్యాత ప్రణాళికా సంస్థల మద్ధతను కూడకట్టుకుంది. ఈ అమరావతి ప్లానింగ్ మరియు డిజైన్ పరిశోధన సంస్థ చంద్రబాబునాయుడు యొక్క మానసపుత్రిక. ప్రపంచంలో వివిధ నగరాల వైఫల్యాలకు గల కారణాలను విశ్లేషిస్తూ, వాటిని అధిగమించేలా ప్రణాళికలను తయారుచేసి అమరావతిని ప్రపంచంలో అత్యుతం ప్రజామోద నగరంగా తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలు, సూచనల ప్రతిరూపమే అమరావతి ప్లానింగ్, డిజైన్ పరిశోధన సంస్థ. ఒక నగర నిర్మాణానికి ప్రణాళికలు తయారు చేయడం అత్యంత క్లిష్టతరమైనది. అందుకే ప్రజా జీవన విధానం పట్ల తనకు గల అపార అనుభవంతో అమరావతి నగర ఆరంభ దశలోనే అమరావతి నగర నిర్మాణం కోసం ప్రయాళికలను సిద్ధం చేసేందుకుగాను ఎవరిపైనా ఆధారపడకుండా, ఆధునాతన ప్రమాణాలతో ఒక సొంత ప్రణాళిక రచన సంస్థను కలిగి వుంటే బాగుంటుందని, ఆ దిశగా ఆలోచించమని సీఆర్డీఏ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.













