నంద్యాల ఉప ఎన్నికలో బీజేపీ మద్దతు ఎవరికో తెలుసా?
నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికే తమ మద్దతని ఏపీ బీజేపీ ప్రకటించింది. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన పదాధికారుల సమావేశంలో ఈ మేరకు తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ బీజేపీ అధికారికంగా ప్రకటించింది. నంద్యాల ఉప ఎన్నికే కాకుండా, కాకినాడ మున్సిపల్ ఎన్నికల్లో కూడా టీడీపీతో కలిసే పని చేయాలని నిర్ణయించారు. టీడీపీ-బీజేపీలు రాష్ట్రంలోనేకాక కేంద్ర ప్రభుత్వంలోనూ భాగస్వాములుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ మద్దతు విషయంలో మాత్రం బీజేపీ తన నిర్ణయాన్ని ఆలస్యంగా వెల్లడించడం గమనార్హం. రేపట్నుంచి టీడీపీతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటామని బీజేపీ నేతలు తెలిపారు. నంద్యాలలో ఆగస్టు 23న పోలింగ్ జరగనుంది.








