బయోమెట్రిక్ తప్పనిసరి: చంద్రబాబు
ఉద్యోగులంతా బయోమెట్రిక్ విధానంలో హాజరు నమోదు చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. తనతో పాటు సీఎస్, మంత్రులు ఆఫీసుకు వచ్చిన వెంటనే బయోమెట్రిక్ పంచ్ వేస్తున్నారని తెలిపారు. ఎంత సమయం ఆఫీసులో ఉంటున్నారో ఉద్యోగులు బేరీజు వేసుకోవాలని ఆయన అన్నారు. అత్యవసర సేవలు అందించేవారికి బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి అని ఆయన చెప్పారు








