అరుదైన రికార్డు సొంతం చేసుకున్న అఖిలప్రియ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో కర్నూలు జిల్లా నుంచి తొలి మహిళా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన భూమా అఖిలప్రియ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. అంతే కాకుండా అతి పిన్న వయసులో మంత్రి పదవిని పొందిన వారి జాబితాలో చోటు దక్కించుకున్నారు. కేవలం 28 ఏళ్ల వయసులోనే ఆమె మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అమె కంటే ముందు కర్నూలు జిల్లా నుంచి సుబ్బరత్తమ్మ, భూమా శోభానాగిరెడ్డి, పాటిల్నీరజారెడ్డి, కోట్ల సుజాతమ్మ, గౌరు చరిత ఎమ్మెల్యేలుగా ఎన్నికైనప్పటికీ వారెవరికీ మంత్రి పదవి దక్కలేదు. కానీ తొలిసారి ఎమ్మెల్యేగా శాసనసభలో అగుడుపెట్టిన అఖిలప్రియ మంత్రివర్గంలో స్థానంలో సంపాదించారు. అది కూడా అమె పుట్టిన రోజు నాడే జరగడం విశేషంగా చెప్పుకోవచ్చు.













