ఏప్రిల్ 2న విజయవాడలోనే ఉంటా
ఏప్రిల్ 2వ తేదీ అతి ముఖ్యమైన రోజని, ఆ రోజున విజయవాడలోనే ఉంటానని సిని హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సృష్టం చేశారు. అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ జీవిత విశేషాలతో వచ్చే ఏడాది సినిమా ఉంటుందని ప్రకటించారు. అనంతపురానికి ఎన్నడూ లేని విధంగా నీటి కేటాయింపులు జరిగాయని అన్నారు. బ్రాంచ్ కెనాల్ ద్వారా సమగ్ర నీటి వియోగం జరుగుతోందని తెలిపారు. హైదరాబాద్ అసెంబ్లీతో పాటు ఏపీ అసెంబ్లీ కూడా బాగుందని అన్నారు. ఏప్రిల్ 2న మంత్రిగా బాలకృష్ణ అల్లుడు లోకేష్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్నే బాలకృష్ణ తన వ్యాఖ్యల ద్వారా పరోక్షంగా ప్రస్తావించారు.













