లోకేష్ కు ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్ ఆహ్వానం
స్పెషల్ విజిట్ ప్రోగ్రాంలో భాగంగా తమ దేశంలో పర్యటించాలని ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్‌ను ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్ (సౌత్ ఇండియా) షాన్ కెల్లీ ఆహ్వానించారు. సచివాలయంలో ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్, ఆ దేశ ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డ్రోన్ టెక్నాలజీ ద్వారా గ్రామాల నుంచి సేకరిస్తున్న డేటాలో ఇమేజ్ రికగ్నిషన్లో సాంకేతిక సహకారం అందించాలనిన మంత్రి కోరినట్లు కెల్లీ తెలిపారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులో నీటి నాణ్యత తెలుసుకునేందుకు సెన్సార్ ఏర్పాటులో కూడా సహకరించాలని మంత్రి కోరారని తెలిపారు. రాష్ట్రంలో బ్యాంక్‌లు లేని గ్రామాల్లో బిటిఐ ఎటిఎంలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. టెక్నాలజీ పరంగా కావాల్సిన సహకారం అందించేందుకు సిద్ధమని హామీ ఇచ్చినట్లు తెలిపారు.








