ఏపీలో ఆస్ట్రేలియా పెట్టుబడులు
ఆంధ్రప్రదేశ్‌లో గనులు, రహదారి, రవాణా, విద్య తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు తమ దేశానికి చెందిన పారిశ్రామికవేత్తలు ఆసక్తిగా ఉన్నారని ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ షాన్ కెల్లీ తెలిపారు. ఆస్ట్రేలియా, క్వీన్స్లాండ్ బృందంతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో విశ్వవిద్యాలయం, లేకుంటే సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేస్తామని, దీనిపై త్వరలో ఒప్పందం చేసుకుంటామన్నారు. ఏపీకి చెందిన హైరిజల్యూషన్ జియోలాజికల్ మ్యాపింగ్ ఏర్పాటుకు అవసరమైన సర్వే అసిస్టెన్స్ సిస్టమ్ కోసం పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నామన్నారు. దీనిపై కూడా త్వరలో ఎంవోయూ చేసుకుంటామన్నారు.








