ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
రాష్ట్రంలో 4 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములను నిర్మించడానికి నాబార్డుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిందని ఏపీ స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేసన్ చైర్మన్ ఎల్వీఎస్ఆర్కే ప్రసాద్ అన్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు గిడ్డంగుల సంస్థ కేంద్ర కార్యాలయాన్ని తరలించిన తర్వాత మొదటిసారి 71వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని అమరావతిలో కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎల్వీఎస్ఆర్కే ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 70 వేల మెట్రిక్‌టన్నుల గోదాములను టెండర్లను పిలిచి పనులు ప్రారంభించామని, మిగతా గోదాములను కూడా త్వరగా పూర్తి చేస్తున్నామని ఏడాదిలోపు మొత్తం 4 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములను పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో జలసిరి అనే పథకం ద్వారా 13 జిల్లాలతో 28 నీటి పారుదల ప్రాజెక్టులను ప్రభుత్వం చేపట్టిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలో చేపట్టారని అన్నారు. ఎప్పుడైతే నీటి పారుదల ప్రాజెక్టులు రాష్ట్రంలో పెంచితే దానికి అనుగుణంగా రైతులకు గిడ్డంగుల అవసరం ఎక్కువగా ఉందన్నారు. దీనికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే కార్పొరేషన్ సొంత గోదాములు 6 లక్షల మెట్రిక్‌టన్నుల ఇన్వేస్టర్ గోదాములు తీసుకోని మొత్తం 10 లక్షల ఇన్వెస్టర్ గోదాములు తీసుకుంటామని దీంతో 20 లక్షల మెట్రిక్‌టన్నుల సామర్థ్యం ఉండేవిధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. టర్మరిక్, మిర్చి కోల్డ్‌స్టోరేజ్‌ల నిర్మాణాలను ఏడాదిలో పూర్తిచేస్తామని తెలిపారు.








