విజయవాడకు తరలి రానున్న ఏపీపీఎస్సీ కార్యాలయం
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కార్యాలయం విజయవాడకు తరలనుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ ఎంజీ రోడ్డులోని ఆర్అండ్బీ భవనంలో కార్యాలయం ఏర్పాటు కానుంది. 45వేల చదరపు అడుగుల స్థలాన్ని రెండేళ్ళపాటు లీజుకు తీసుకున్నారు.








