ఆయన జీవితాంతం సీఎంగా ఉండాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు జీవితాంతం ముఖ్యమంత్రిగా ఉండాలని ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పి.అశోక్బాబు అన్నారు. కాకినాడలో జరిగిన మహాసంకల్పం సభలో అశోక్బాబు మాట్లాడారు. చాలామందికి తెలియక పోవచ్చుగానీ ఉద్యోగ సంఘాల నాయకులుగా మాకు తెలుసు. చంద్రబాబు వల్ల రాష్ట్రానికి అంతర్జాతీయ ఇమేజ్ వస్తోంది అన్నారు. రాష్ట్రాన్ని దుర్మార్గంగా విభజించి రాజధాని కూడా లేకుండా పొమన్నారు. 34 అసెంబ్లీ సీట్లున్న గోదావరి జిల్లాల్లో మిత్రపక్షంతో కలసి 30 చోట్ల టీడీపీని గెలిపించినందుకు ఇక్కడి ప్రజలను ఉద్యోగ సంఘాల తరపున అభినందిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ స్థిరత్వం అవసరం. అమరావతి నిర్మాణాన్ని వ్యతిరేకించడాన్ని అంతా ఖండించాలని అన్నారు.








