ఏపీ జెన్కో కు ఇంటర్నేషనల్ ఐకాన్ పురస్కారం
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలకు మరో పురస్కారం లభించింది. ఏపీ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీ జెన్కో) మేనేజింగ్ డైరెక్టర్ కె.విజయనంద్కు ఇంటర్నేషనల్ ఐకాన్ అవార్డు దక్కింది. ఇదే సమయంలో ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్)లో గరిష్ట సామర్థ్యానికి ఇప్పటికే జాతీయస్థాయిలో అవార్డులను చేజిక్కించుకున్న ఏపీ జెన్కో అంతర్జాతీ స్థాయిలోనూ బంగారు పతకం లభించింది. కౌలాలంపూర్లో జరిగిన ఇండో-మలేషియా ఆర్థిక సహకార సదస్సులో మలేషియా ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ డిప్యూటీ మినిస్టర్ వై.బి.దాటుక్ చేతుల మీదుగా విజయానంద్ ఇంటర్నేషనల్ ఐకాన్ అవార్డు అందుకున్నారు. ప్రొడక్టివిటీ అండ్ మేనేజ్మెంట్, కార్పొరేట్ సెక్టార్ అండ్ మేనేజ్మెంట్ విభాగాల్లో ఈ పురస్కారాన్ని అందుకున్నారు.













