ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ బోర్డు సమావేశం
గుంటూరు జిల్లాలోని స్పైసెస్ పార్కులో 26వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 6500 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 4 యూనిట్లతో కూడిన మిర్చి, అల్లం ప్రాసెసింగ్, కోల్డ్ స్టోరేజ్ ల నిర్మాణానికి బోర్డు ఆమోదం తెలిపింది. అలాగే కార్పొరేషన్ ఆఫీసును హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించడాన్ని కూడా బోర్డు ఆమోదం తెలిపింది. ఏపీ స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ ఎల్విఎన్ఆర్కే ప్రసాద్ అధ్యక్షతన 191వ బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇంకా స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, తెలంగాణ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ మధ్య ఆస్తుల విభజన, ఉద్యోగుల విభజనకు బోర్డు ఆమోదం తెలిపింది. త్వరలో మరో 4 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాములు నిర్మాణానికి వెంటనే చర్యలు చేపట్టాలని బోర్డు నిర్ణయించింది. ఈ సమావేశంలో ఎండి కె.వి.రమణ, డైరెక్టర్లు ఎస్టి చౌదరి, బిఎల్ఎస్. మణిశంకర్‌నాయుడు, మెట్ల వెంకటరమణ, గంగొడు నాగేశ్వర్రావు, డి.రాజవర్ధన్‌రెడ్డి, పవన్‌కాంత్, ఎస్కె. గ్రోవర్, పి.కె.దాసు పాల్గొన్నారు.








