ఏపీ పోలీసులకు రెండు అవార్డులు
రాష్ట్ర పోలీసు శాఖకు రెండు విభాగాల్లో ఫిక్కీ స్మార్ట్ పోలీసింగ్ అవార్డులు లభించాయి. రాష్ట్రంలో అమలవుతున్న ఉత్తమ స్మార్ట్ పోలీసింగ్ విధానాలను అభినందిస్తూ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ (ఫిక్కీ) ఈ అవార్డులను అందించింది. కోర్టు పర్యవేక్షణ వ్యవస్థ, ఈ -ట్రాఫిక్ చలానా విభాగాల్లో ఆంధ్రప్రదేశ్‌కు అవార్డులు వచ్చాయి. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో న్యూఢిల్లీ ఎంపీ(బీజేపీ) మీనాక్షి, ఫిక్కీ చైర్మన్ వైకే. మోదీ, కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్లైల చేతుల మీదుగా విజయవాడ డీసీపీ అశోక్ కుమార్ ఈ అవార్డులను అందుకున్నారు.








