ఆక్వా ఎగుమతిలో ఏపీ ప్రథమస్థానం
ఆక్వా ఎగుమతిలో ఏపీ ప్రథమస్థానంలో ఉందని ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ, మత్స్యశాఖ అధికారులతో మంత్రి కామినేని శ్రీనివాస్ భేటీ అయ్యారు. రొయ్యల పెంపకంలో వాడే మందుల వల్ల రోగాలు వస్తున్నాయన్నారు. రొయ్యల పెంపకంలో యాంటీబయోటిక్స్ వాడొద్దన్నారు.








