దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి లీలలు.. వైసీపీలో వణుకు పుట్టిస్తున్న మాజీ మంత్రుల లింకులు..!
దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ (AC) శాంతి వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అవినీతి, అక్రమాలతో మొదలైన ఈ వివాదం.. ఇప్పుడు మాజీ మంత్రుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఆమె వెనుక ఉన్న ఆ పెద్దలు ఎవరు..? ఆమె నోరు విప్పితే బయటపడే ఆ మాజీ మంత్రుల బాగోతం ఏంటి..? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్. గత ప్రభుత్వ హయాంలో శాంతి దేవాదాయ శాఖలో అత్యంత కీలకంగా వ్యవహరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆమెకు పదోన్నతులు కల్పించడం వెనుక ఇద్దరు మాజీ మంత్రుల హస్తం బలంగా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
కేవలం అధికార బలంతోనే ఆమె శాఖలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, విలువైన ఆలయ భూముల వ్యవహారాల్లో కూడా ఆమె వేలు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఈమె వ్యవహారం బయటకు రావడంతో ఆ మాజీ మంత్రులు ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓటమి భారంతో ఉన్న వారికి, ఇలాంటి వ్యక్తిగత, అవినీతి ఆరోపణలు తోడవడంతో ఏం సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితి. ముఖ్యంగా సదరు మహిళా అధికారిణితో సన్నిహితంగా ఉన్న మాజీ మంత్రులు వీళ్ళే అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం వారికి చికాకు పెంచుతోంది.
శాంతి వద్ద ఉన్న సమాచారం లేదా కొన్ని కీలక ఆధారాలు బయటకు వస్తే, గత ప్రభుత్వంలోని కీలక నేతల బండారం బయటపడుతుందని అంతా భావిస్తున్నారు. అందుకే ఆమెను శాంతింపజేయడానికి లేదా ఈ ఇష్యూని పక్కదారి పట్టించడానికి తెర వెనుక.. కొందరు పెద్ద మనుషులు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె రిమాండ్ లో ఉన్నారు. తాజాగా మూడు రోజుల కస్టడీలో ఆమె ఏ విషయాలు బయటపెట్టలేదు. ఒకవేళ బయటపెడితే పరిస్థితి ఏంటీ అనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇవి కూడా చదవండి








